ఏపీలో మరో బర్కెలక్క.. జేడీ సమక్షంలో పార్టీలో చేరిన శిరీష..

ఏపీలో మరో బర్కెలక్క.. జేడీ సమక్షంలో పార్టీలో చేరిన శిరీష.. తెలంగాణ బ‌ర్రెల‌క్క శిరీష‌లా, పామర్రులో మ‌రో శిరీష ఎన్నిక‌ల బ‌రిలో దిగుతున్నారు. కృష్ణా జిల్లా పామ‌ర్రు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీకి నాయుడు శిరీషా రాణి అనే మ‌హిళను జైభార‌త్ నేష‌న‌ల్ పార్టీ ఎంచుకుంది. మొవ్వ‌కు చెందిన గ్రాడ్యుయేట్ శిరీషా, వంద మంది మ‌హిళ‌ల‌తో బుధ‌వారం విజ‌య‌వాడ‌లో జైభార‌త్ నేష‌న‌ల్ పార్టీలో చేరారు. బీ.కాం (కంప్యూట‌ర్స్) చ‌ద‌విన శిరీషను పామ‌ర్రు అసెంబ్లీ ఇన్ ఛార్జిగా నియ‌మిస్తూ, జైభార‌త్ నేష‌న‌ల్ పార్టీ అధ్య‌క్షుడు వి.వి.ల‌క్ష్మీనారాయ‌ణ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఈ సంద‌ర్భంగా ల‌క్ష్మీనారాయ‌ణ మాట్లాడుతూ, తెలంగాణాలో బ‌ర్రెల‌క్క‌లా కృష్ణా జిల్లా పామ‌ర్రు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి నాయుడు శిరీషా రాణి, రాజ‌కీయ అరంగేట్రం చేస్తున్నార‌ని చెప్పారు.