జనవరి 4 న కాంగ్రెస్ లో Ysrtp విలీనం - Ys Sharmila కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరిక ఖాయమైంది. గురువారం (జనవరి 4) కాంగ్రెస్ పార్టీలో వైఎస్‌ఆర్‌టీపీ విలీనం కాబోతోంది. ఇందుకోసం బుధవారం (డిసెంబర్ 3) సాయంత్రమే ఢిల్లీ వెళ్లనున్న షర్మిల.. అక్కడ కాంగ్రెస్ పెద్దల సమక్షంలో ఆ పార్టీలో చేరబోతున్నారు. ఇదే విషయాన్ని లోటస్ పాండ్‌లో జరిగిన పార్టీ నేతల సమావేశంలో షర్మిల స్పష్టం చేశారు