తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మధ్య సవాళ్ల పర్వంతో హైటెన్షన్ పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. అరికెపూడి గాంధీతోపాటు ఆయన అనుచురులు కౌశిక్‌రెడ్డి ఇంటికి భారీగా చేరుకోవడంతో రణరంగంగా మారింది.