హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు బియాస్ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో చండీగఢ్-మనాలీ హైవేలో కొంత భాగం కొట్టుకుపోయింది. మనాలి వద్ద జాతీయ రహదారి కొట్టుకుపోయింది. పోలీసులు జాతీయ రహదారిని పరిశీలించారు. వాహనదారులు సురక్షితంగా వెళ్లేలా దగ్గరుండి చూస్తున్నారు. అత్యవసరమైతేనే ప్రయాణం చేయాలని, లేకుంటే సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.