నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టు

నకిలీ డిగ్రీ సర్టిఫికెట్‌లు తయారు చేసి విదేశాలకు పంపుతున్న ఇద్దరు నిందితులను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి నకిలీ డిగ్రీ సర్టిఫికెట్‌లు, నకిలీ యూనివర్సిటీ స్టాంపులు, సెల్ ఫోన్లు 10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ హస్తినాపురం ప్రాంతానికి చెందిన కాతూజు అశోక్ నకిలీ ధనలక్ష్మి ఓవర్సీస్ అబ్రాడ్ స్టడీ మరియు వీసా కన్సల్టెన్సీ నడుపుతున్నాడు. అయితే ఇతనికి 2021 లో కేరళకు చెందిన వ్యక్తి నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ తయారు చేసి విదేశాలకు పంపే వారితో పరిచయం ఏర్పడింది.