లోక్‌సభ ఎన్నికల్లో విజయంపై ధీమాతో ఉన్న బీజేపీ శ్రేణులు భారీ సెలబ్రేషన్స్‌కు సిద్దమవుతున్నాయి. దేశ వ్యాప్తంగా జరగబోయే లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు ఎవరి ఏర్పాట్లలో వాళ్లు తలమునకలై ఉన్నారు. అటు సీఈసీ కౌంటింగ్ నిర్వహించడంపై వివిధ రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.