కాలిఫోర్నియాలో కార్చిచ్చు బీభత్సం.. మంటల్లో ఆహుతైన అటవీ ప్రాంతం

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. కాలిఫోర్నియా దక్షిణభాగంలో లైన్ ఫైర్ కార్చిచ్చు శరవేగంగా వ్యాపిస్తోంది. ఎన్నో వేల ఎకరాలను ఇది కాల్చి బూడిద చేసింది. దీంతో వేలాది మంది ఆ ప్రాంతాలను వదిలి వెళ్లిపోతున్నారు.