పొలం పనులు చేస్తుండగా అనుకోని అతిథి..!

నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని సింగన్ గావ్ గ్రామ శివారులోని సోయా పంట పొలంలో ఆదివారం కొండచిలువ కలకలం రేపింది. వ్యవసాయ పనులు చేస్తున్న లక్ష్మణ్ పోతన్న పొలాల్లో భారీ కొండ చిలువ కనిపించింది. ఈ అతి పెద్ద కొండచిలువను చూసిన రైతులు భయంతో పరుగులు తీశారు. ఆ వెంటనే గ్రామస్తులు తానూర్ గ్రామానికి చెందిన స్నేక్ క్యాచర్ షహబాజ్ అనే యువకుడికి సమాచారం అందించారు. దీంతో అతను ఘటనా స్థలానికి చేరుకుని గంట పాటు శ్రమించి కొండచిలువను సురక్షితంగా పట్టుకున్నాడు. ఈ సంఘటన గ్రామస్తుల్లో ఉత్కంఠను రేకెత్తించింది. కాని షహబాజ్ చాకచక్యం వ్యవహరించి పామును పట్టుకున్నారు. అనంతరం కొండచిలువను అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలివేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.