రుషికొండ భవనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు

రుషికొండ భవనాల నిర్మాణం ముమ్మాటికీ నేరమే అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.. భవన నిర్మాణాల తీరు.. నిబంధనల ఉల్లంఘనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదు. పూర్తి విచారణ జరిపి శిక్షిస్తామని హెచ్చరించారు.