రేకుల షెడ్డులో ఏటీఎం మిషన్.. అసలేం జరిగిందంటే..!

అంబేద్కర్ కోనసీమ జిల్లా మురమళ్ల గ్రామ పంచాయతీ చేపల సంత మార్కెట్ వద్ద రేకుల షెడ్ లో INDIA1 ATM ఏర్పాటు చేశారు. రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా రేకుల షెడ్‌లో ATM ఏర్పాటు చేయడం పట్ల అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. కాయగూరలు షాప్ పెట్టుకోవడానికి పంచాయతీ వద్ద లీజుకు తీసుకున్నాడు ఓ వ్యక్తి. షాప్ ఏర్పాటు చేయకుండా ఏకంగా ATM సెంటర్‌కు సబ్ లీజుకు ఇచ్చాడు. ఈ విషయం తెలిసి స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.