'మేమంతా సిద్దం' తొలి బహిరంగ సభలో సీఎం జగన్.. ఏమన్నారంటే..

ఏపీ రాజకీయాల్లో హీటెక్కించే ప్రచారానికి శంఖం పూరించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. మేమంతా సిద్దం అంటూ బస్సు యాత్రను ఇడుపులపాయ నుంచి ప్రారంభించారు. ఈ యాత్ర వేంపల్లి, వీరపునాయపల్లి, ఉరుటూరు, యర్రగుంట్ల, పోట్లదుర్తి మీదుగా ప్రొద్దుటూరు చేరుకుంది. యాత్రలో పలువురిని కలుసుకుంటూ వారితో మాట్లాడుతూ సీఎం జగన్ ముందుకు సాగారు.