బెంగళూరు శివారులో చిరుత పులి కలకలం కర్ణాటక రాజధాని బెంగళూరు శివారులో చిరుత పులి కలకలం రేపింది. హఠాత్తుగా చిరుతపులి ఓ ఇంట్లోకి దూరింది. ఇంట్లో నక్కిన చిరుతను చూసి ఆ కుటుంబం వణికిపోయింది. అధికారులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చిరుతను బంధించేందుకు తీవ్రంగా శ్రమించారు. చిరుతకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బంధించారు అధికారులు. ఐదు గంటల ప్రయత్నం తర్వాత ఆపరేషన్ విజయవంతం అయింది. చిరుతను బంధించడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.