ఆయిల్ ట్యాంకర్ బోల్తా..

జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణ శివారులోని హెచ్ పి పెట్రోల్ బంక్ సమీపంలో జాతీయ రహదారిపై ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఆయిల్ ట్యాంకర్ నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడ్డాయి.ఈ ఘటనలో డ్రైవర్ బయటకు దూకి ప్రమాదం నుంచి బయటపడ్డాడు.. స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.