ఏపీలో పోలింగ్ జరిగిన తీరు ఆశ్చర్యపర్చిందన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఉదయం 7 గంటలకే మహిళలు, వృద్ధులు పోలింగ్ కేంద్రాలకు వచ్చారన్నారు. ఈ పోలింగ్ వైసీపీ విజయానికి సంకేతం అని చెప్పారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ చర్యలపై మండిపడ్డారు. సీఎం జగన్ ను గెలిపించడానికి మహిళలు, వృద్దులు గంటల తరబడి పోలింగ్ కేంద్రాల వద్ద నిల్చొని ఓటు వేశారన్నారు. ప్రచారం నుంచి కూడా మహిళలే ముందున్నారని చెప్పారు.