నది మధ్యలో సడెన్‌గా ఆగిపోయిన పడవ.. అంతలోనే పెరిగిన ప్రవాహం.. తర్వాత ఏం జరిగింది

కృష్ణా నదిలో తృటిలో పడవ ప్రమాదం తప్పింది.. వేదాద్రి నుంచి గుంటూరు జిల్లా గింజపల్లి వైపు ప్రయాణిస్తున్న పడవలో ఒక్కసారిగా సాంకేతిక లోపం సంభవించింది.. ఇంజన్ బ్యాటరీ పనిచేయకపోవడంతో పడవ మార్గ మధ్యలో నిలిచిపోయింది.. మరోవైపు నదీ ప్రవాహం ఉండడంతో పడవ కొంత దూరం కొట్టుకుపోయింది. దీన్ని గమనించిన అక్కడి స్థానికులు పడవలో ప్రయాణిస్తున్న 30 మంది ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు.