చార్మినార్‌లో ధ్వంసమైన గడియారానికి రిపేర్లు ప్రారంభం..

చార్మినార్‌లో ధ్వంసమైన గడియారానికి రిపేర్లు ప్రారంభించారు ఆర్కియాలజీ విభాగం సిబ్బంది. మరమ్మతు పనుల్లో భాగంగా నిన్న తూర్పు వైపున ఉన్న పురాతన గడియారం ధ్వంసమైంది. గోవ పైప్‌లు తీస్తుండగా 135 ఏళ్ల నాటి గడియారానికి పైపులు తగిలాయి. దీంతో డయల్‌ బోర్డు దెబ్బతిన్నది.