ఆ శివలింగాన్ని నీటిలో ఉంచకపోతే అగ్ని ప్రమాదాలు తప్పవా.

సాధారణంగా ఆలయం అంటే నిత్యం పూజలు, భక్తులకు దర్శనం ఇవ్వడం వంటివి సాంప్రదాయ బద్ధంగా కార్యక్రమాలు జరుగుతుంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లోని ఓ గుడిని మాత్రం నిత్యం నీటిలో ఉంచుతారు. కేవలం గోపురం మాత్రమే కనిపిస్తుంటుంది. అలా అని ఆ గుడి ఏ నది మధ్యలోనో లేదు. ఓ పక్కగా ఉంటుంది. కాని ఒక్క వైశాఖ మాసంలో నెల రోజులు మాత్రం నీటిని తోడి భక్తులకు దర్శనం కు వీలు కల్పిస్తారు.