నిత్యం భయం భయం.. అయినా సాగాల్సిందే ఉద్యోగం..! ఎప్పుడు ఊడిపడుతాయో తెలియని పైకప్పులు. వర్షపు నీటితో పాకురు పట్టిన గోడలు, నీళ్లదారలతో తడిచి ముద్దవుతున్న గదులు. పగిలిపోయి దర్శనమిస్తున్న ఫ్లోర్ టైల్స్.. హఠాత్తుగా దర్శనమిస్తున్న విష సర్పాలు. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని శిథిల భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాల పరిస్థితి. వారం రోజులుగా వర్షాలు దంచి కొడుతుండటంతో ఆ శిథిల భవనాలు మరింత ప్రమాదకరంగా మారి భయపెడుతున్నాయి. నిర్మల్ , ఆదిలాబాద్, మంచిర్యాల , ఆసిఫాబాద్ ఒక్క జిల్లా ఏంటీ.. ఏ ప్రాంతంలో చూసినా ఏమున్నది గర్వకారణం శిథిలమైన భవనం కుప్పకూలేందుకు సిద్దంగా ఉన్న సముదాయం అన్నట్టుగానే ఉంది. హెల్మెట్లు ధరించి విధులు.. గొడుగులు పట్టుకుంటేనే సాగుతున్న చదువులు. శిథిలావస్థకు చేరి మరింత భయపెడుతున్నా పాఠశాల భవనాలు.