వడ్డీకాసుల వాడిని దర్శనానికి మెడ నిండా బంగారే..!

వడ్డీకాసుల వాడిని దర్శనానికి మెడ నిండా బంగారే..! తిరుమల వెంకన్న.. వెలకట్టలేని వజ్ర వైడూర్యాలు, టన్నుల కొద్దీ బంగారు ఆభరణాలు ఆయన సొంతం. అంతటి అలంకార ప్రియుడు తిరుమల శ్రీవెంకటేశ్వరుడు. ఆయన వద్దకు మహారాష్ట్రకు చెందిన ఒక కుటుంబం తామేమీ తక్కువ కాదన్నట్లు కిలోల కొద్దీ బంగారు ఆభరణాలతో దర్శన మిచ్చింది. ఏకంగా బంగారు పూత పూసిన కారులో తిరుమలకు వచ్చి, శ్రీనివాసుడిని దర్శించుకుంది. శ్రీవాణి ట్రస్ట్ కు విరాళం ఇచ్చి విఐపి బ్రేక్ దర్శన సమయం లో వెంకన్నకు మొక్కులు తీర్చుకున్నారు.