వామ్మో.. ఈ కండక్టర్ టాలెంట్ మాములుగా లేదు కేరళలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. బస్సులో ప్రయాణం చేస్తున్న ప్రయాణికుడు ఒక్కసారిగా కిందపడిపోతుంటే కండక్టర్ సినీ హీరో రేంజ్ లో కాపాడాడు. కండక్టర్ టికెట్ కొట్టుకుంటూనే ప్రయాణికుడు పడటం చూసి చేయి పట్టుకొని కాపాడతాడు. కండక్టర్ వల్ల పెద్ద పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ కండక్టర్ మంచి స్పైడర్ మ్యాన్ లా ఉన్నాడని కామెంట్లు పెడుతున్నారు.