"ఇది మన ప్రభుత్వం" పేరిట చంద్రబాబు టూర్ ఖరారు

"ఇది మన ప్రభుత్వం" పేరిట చంద్రబాబు టూర్ ఖరారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం(సెప్టెంబర్ 20) శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజుల పూర్తైన నేపథ్యంలో "ఇది మన ప్రభుత్వం" పేరిట జిల్లాలోని కవిటి మండలం రాజపురం గ్రామంలో నిర్వహించే గ్రామ సభలో ఆయన పాల్గొనున్నారు. శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆరు రోజులపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రగతిని ప్రతి ఇంటికి చేరవేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు పార్టీ వర్గాలు.