మంచి ఫుడ్ బ్రాండ్ అని పోతే.. అసలు సంగతి ఇదీ.. కోర్టు ఆర్డర్‌తో రంగంలోకి పోలీసులు..

హైదరాబాద్ నగరంలో టేస్టీ ఫుడ్ దొరుకుతుంది.. అలానే హెల్తీ ఫుడ్ కూడా దొరుకుతుంది. కానీ టేస్టీ అండ్ హెల్తీ ఫుడ్ దొరకడం చాలా రేర్. అలా కష్టపడి బ్రాండ్ ఏర్పాటు చేసుకున్నవాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రజల నమ్మకాన్ని చూరగొన్నారు. అయితే అలాంటివారికి ఇప్పుడు పెద్ద చిక్కొచ్చిపడింది. పేర్ల చివర, మొదలు కనిపించని విధంగా ఫేమస్ బ్రాండ్స్ పెడుతూ.. కస్టమర్స్ ని మోసం చేస్తున్నారు. పేరు చూసి పోయి.. అక్కడ తినేటప్పుడు క్వాలిటీ, సర్వీస్ చూసి కంగుతినడం ప్రజల వంతు అవుతుంది.