చౌకబియ్యం చుట్టూ జరుగుతున్న రాద్ధాంతం.. ఏపీ రాజకీయాల్ని ఉడుకెత్తిస్తోంది. సీజ్ ది షిప్.. అంటూ కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం మొదలుపెట్టిన బియ్యం గొడవ ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. ఇంతకీ.. ఆ బియ్యం ఎవరివి.. అని ఆరా తీస్తే.. మంత్రిగారి వియ్యంకుడి పేరే బైటికొస్తోంది. ఇంకేముంది విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఇష్యూని మరింత సీరియస్ చేస్తూ బాంబులు పేల్చాయి. మరి కూటమి ప్రభుత్వం రియాక్షన్లేంటి..? రెండుగంటల పాటు జరిగిన భేటీలో సీఎం, డిప్యూటీ సీఎం తేల్చిందేంటి...?