ఓరుగల్లు ప్రజలను వణికిస్తున్న గబ్బిలాలు.. ఆ మూడు చెట్ల పైనే ఆవాసం

వరంగల్ మహానగరంలో జనాభా పెరుగుదల ఎంతగా ఉందో అదే స్థాయిలో కోతులు కుక్కల ఎదుగుదల ఉంది. సగటున కనీసం రోజుకు ఐదుగురు కుక్కకాటుకు గురవుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటికే కోతుల కుక్కలతో బెంబేలెత్తిపోతున్న ఓరుగల్లు ప్రజలను ఇప్పుడు గబ్బిలాలు గజగజ వణికిస్తున్నాయి. హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ పరిసరాల్లో కేవలం ఓ మూడు చెట్లనే ఆవాసంగా ఏర్పాటు చేసుకొని వేల సంఖ్యలో గబ్బిలాలు ఇక్కడ సేద తీరుతున్నాయి.