ధనుర్మాసంలో మకర సంక్రాంతి ముందు వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున శ్రీ మహా విష్ణువు నివాసం వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని నమ్మకం. ఇలలో వైష్ణవాలయాలను విష్ణు నివాసంగా భావిస్తారు. కనుక ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తరద్వారం ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకోవాలని భావిస్తారు. అందుకనే భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనం కోసం వేచి ఉంటారు. తిరుమలలో ఇప్పటికే వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. విద్యుత్ కాంతులతో రంగుల పువ్వులతో స్వామివారి ఆలయంతో సహా పరిసరాలు కనుల విందు చేస్తున్నాయి.