డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రభాస్ ప్రచారం ఈ ఏడాది కల్కి 2898 ఏడీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం తర్వాత ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు డార్లింగ్. తాజాగా డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రచారం చూస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు డార్లింగ్. తెలంగాణ ప్రభుత్వం చేస్తోన్న డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో తనవంతు బాధ్యతగా ఈ వీడియోను నెట్టింట పంచుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.