మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కే.సంగ్మా పియానో వాయించి ఆకట్టుకున్నారు. ఆ రాష్ట్ర రాజధాని షిల్లాంగ్‌లోని రాజ్‌భవన్‌లో బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్ 'షెహ్లో నషా..'ను వాయించి సీఎం ఆశ్చర్యపరిచారు. ఆయన ఉపయోగించిన పియానో 150 ఏళ్ల క్రితం నాటిది కావడం విశేషం. సీఎం కాన్రాడ్ కే.సంగ్మా ప్రదర్శన సమయంలో ఆ రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విజయ్ శంకర్ సైతం అక్కడే ఉన్నారు.