ఆర్టీసీ బస్సు ఢీకొని యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తగూడ చౌరస్తాలో చోటుచేసుకుంది. యువతి రోడ్డు దాటుతుండగా వేగంగా దూసుకొచ్చిన బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. దాంతో, యువతి అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది.