సింగపూర్ స్కూల్లో జరిగిన ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మార్క్ శంకర్ సింగపూర్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రమాద ఘటన గురించి తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్.. ఆయనతోపాటు మెగాస్టార్ చిరంజీవి సైతం సింగపూర్ బయల్దేరి వెళ్లారు. తాజాగా తన కొడుకు ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. అందరి ఆశీస్సులతో తన కొడుకు కోలుకుంటున్నాడని అన్నారు. పవన్ చిన్నకుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్‌లో చదువుకుంటున్నారు. ఆయన వయసు ఏడున్నరేళ్లు. ప్రమాదంలో మార్క్ శంకర్ కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి.