పక్కనే పెట్రోల్ బంకు..కారులోంచి మంటలు.

పక్కనే పెట్రోల్ బంకు..కారులోంచి మంటలు. విశాఖపట్నం ఎన్ఏడి నుంచి గోపాలపట్నం మీదగా పెందుర్తికి ఓ కారు వెళుతోంది. గోపాలపట్నం జంక్షన్ కు వచ్చేసరికి.. కారులోంచి ఒక్కసారిగా మంటలు చెరేగాయి. తెరుకునేలోపే భారీ మంటలు కారంతా వ్యాపించాయి. పక్కనే పెట్రోల్ బంక్ ఉండడంతో స్థానికుల్లో మరింత ఆందోళన పెరిగింది. పెట్రోల్ బంకులో ఉన్న ఫైర్ ఎగ్జాస్టర్ తెచ్చి మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నింంచారు. ఆ ప్రయత్నం ఫలించలేదు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు స్థానికులు. ఈలోగా కేవలం పదిహేను నిమిషాల్లోనే కారు పూర్తిగా కాలిపోయింది.