మహిళలకు తమ ప్రభుత్వంలో పెద్ద పీట వేశామన్నారు. అన్ని స్థానిక సంస్థల పదవుల్లో 50శాతం మహిళలకే సీట్లు కేటాయించామన్నారు. చట్టసభల్లోనూ మహిళలకే అగ్రభాగం కేటాయించామన్నారు. క్యాబినెట్ పదవుల్లో కూడా అధికశాతం మంది మహిళలు ఉన్నారన్నారు. అలాగే పేదవాడి ఇంట్లో చదువుకు డబ్బులు అడ్డంకిగా మారకూడదని అమ్మ ఒడి ఇచ్చామన్నారు.