భారత ప్రధాని నరేంద్ర మోదీ బ్రూనై పర్యటనలో ఉన్నారు. బ్రూనై సుల్తాన్ హాజీ హసనల్ బల్కియా ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఇక్కడికి చేరుకున్నారు. బ్రూనై పర్యటన చేసిన మొదటి భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు. క్రౌన్ ప్రిన్స్ అల్-ముహతాది ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికారు. భారత ప్రధానిగా తొలి ద్వైపాక్షిక పర్యటన ఇదే కావడం విశేషం.