సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్..

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ షెడ్యూల్ ప్రకారం బుధవారం జరిగిన సభతో మేమంతా సిద్దం బస్సుయాత్ర ముగిసింది. సిక్కోలు సింహాల్లా సభకు భారీ ఎత్తున తరలివచ్చారు ప్రజలు. పెత్తందారుల ముఠాపై యుద్ధానికి సిద్ధం అంటూ సీఎం జగన్ కార్యకర్తల్లో జోష్ నింపారు. డబుల్‌ సెంచరీ కొట్టేందుకు సిద్ధమా అని ప్రజలను అడిగారు. ఇవి పేదల భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు అన్నారు ఆయన. తనకు ఓటు వేస్తేనే పథకాలన్నీ కొనసాగుతాయని చెప్పారు. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు అన్నీ బంద్‌ అవ్వడమే కాకుండా.. మళ్లీ ప్రజలను మోసం చేస్తారు..జాగ్రత్త అని సూచించారు సీఎం జగన్. చంద్రబాబు మోసాలకు చెంపచెళ్లుమనేలా ఓటుతో సమాధానం చెప్పాలని కోరారు.