వింత వింత ఆకారాలతో గణపతిని ప్రతిష్టించి నవరాత్రులు పూజలు చేస్తున్నారు. భారీ గణపతులు.. ఎత్తైన గణపతి విగ్రహాలే కాదు.. డిఫరెంట్ ఆకారాలు అలంకరణలతో ప్రతిష్టించిన గణేష్ విగ్రహాలు ఓరుగల్లు లో చూపరులను అబ్బుర పరుస్తున్నాయి. వివిధ ఆకారాలలో ప్రత్యేకంగా తయారు చేయించి ప్రతిష్టించిన గణపతి విగ్రహాలు చూడడం కోసం భక్తులు బారులు తీరుతున్నారు.