ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. నిర్మల్, మంచిర్యాల జిల్లాలో ఏసీబీ వరుస దాడులకు అవినీతి చేపలు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాయి. నిర్మల్ జిల్లా కడెం మండలంలో ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ కడెం ఎమ్మార్వో, డీటీ పట్టుబడగా.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఏసీబీ అధికారులు జరిపిన దాడుల్లో 15 వేల రూపాయల లంచం తీసుకుంటూ కాసిపేట పంచాయితీ రాజ్ ఏఈ పట్టుబడ్డారు.