హైదరాబాద్ పాతబస్తీలో మరో విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది. షాడో పోలీస్‌నంటూ పోలీసుల దగ్గరే మామూళ్లు వసూలు చేసేందుకు ప్రయత్నించాడు ఓ హోంగార్డ్. బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీసులను ఓ హోంగార్డు మోసం చేయడానికి ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యాడు. హోమ్‌గార్డు ఫరీద్ సివిల్ డ్రెస్‌లో ప్రైవేట్ వాహనంపై రాత్రివేళ పోలీసులు నిర్వహిస్తున్న పహారా వద్దకు చేరుకుని తాను షాడో టీంలో ఉన్న అధికారి నంటూ డబ్బులు వసూలు చేసేందుకు యత్నించాడు. పోలీసులను బెదిరించడమే కాకుండా, వారి పనితీరును పర్యవేక్షిస్తున్నట్టు నటిస్తూ వీడియోలు తీస్తూ వేధించడం ప్రారంభించాడు.