పాపం.. ఆ తల్లికి ఎంత కష్టమొచ్చింది..! అమ్మ అనాథ గా మారింది..! కొడుకులు ఉన్నా.. అన్నం పెట్టలేదు. ఇంట్లో ఉండేందుకు అవకాశం ఇవ్వలేదు. వంతులు వేసుకుని పోషణకు సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు భరోసా కల్పించారు ఆ అమ్మకు..! ఆస్తిని పంచుకున్న అన్నదమ్ములిద్దరూ అమ్మకు బుక్కెడు బువ్వ పెట్టడానికి కూడా వంతులు వేసుకున్నారు. గడువు ముగిసిందని ఓ కొడుకు ఇంటినుండి వెల్లగొడ్తే.. తల్లిని చూసుకోవల్సి వస్తుందని మరో కొడుకు ఇంటికే తాళం వేసుకుని వెళ్ళిపోయాడు. అందరూ ఉన్నా అనాథగా మారిన ఆ అమ్మ గురించి తెలుసుకున్న పోలీస్ ఇన్స్‌పెక్టర్ సదన్ కుమార్ రంగంలోకి దిగారు.