మందులు కొందామని మెడికల్‌ షాపుకు వెళ్లిన వ్యక్తి.. అంతలోనే దారుణం!

ఓ వ్యక్తి ఒంట్లో కాస్త నలతగా ఉండటంతో దగ్గరిలోని మెడికల్ షాపులో మందులు కొందామని వచ్చాడు. అయితే షాపు వద్ద మందులు కొంటుండగా ఆయన ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే మరణించాడు. ఈ షాకింగ్‌ ఘటన కర్ణాటకలోని చిక్కమగళూరు నగరంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అసలేం జరిగిందంటే..