గదిలో ఏదో వింత శబ్ధం.. ఏంటాని కాస్త తొంగి చూడగా గుండె గుభేల్! ఊరు ఊరంతా పరుగులే..

ప్రమాదం ఎప్పుడు ఎటు నుంచి వస్తుందో ఊహించలేం. నిత్యం అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. వచ్చేది శీతాకాలం. ఈ కాలంలో వెచ్చదనం కోసం విష సర్పాలు జనావాసాల్లోకి వస్తుంటాయి. అందుకే ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఊహించని నష్టం జరిగిపోతుంది. తాజాగా ఓ ఇంట్లోకి ఏకంగా కొండ చిలువ దూరేసింది. దీంతో ఊరుఊరంతా పరుగులు తీసింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఈ ఘటన చోటు చేసుకుంది.