దేవుడా కరుణించు.. ఊళ్లకు తాళం వేసి అడవి బాట పట్టిన జనం.. ఆంధ్రాలో వింత ఆచారం..

రుతుపవనాలు విస్తరించినా.. వరుణ దేవుడు కరుణించడం లేదు.. దీంతో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది.. వర్షాలు ముఖం చాటేయడంతో రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా కుప్పం నియోజక వర్గంలో వింత ఆచారం వెలుగులోకి వచ్చింది.. వర్షం కోసం వలస దేవరలు ఏర్పాటు చేసుకున్న గ్రామాలు వలసదారి పట్టాయి.