పైకి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్. లోన కరుడుగట్టిన హార్డ్‌వేర్‌ క్రిమినల్.

పైకి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్. లోన కరుడుగట్టిన హార్డ్‌వేర్‌ క్రిమినల్. టాలీవుడ్‌ను పైరసీ భూతంలా పట్టి పీడించిన ఐ బొమ్మాళి రవి.. పర్సనల్‌ లైఫ్‌లో కూడా సేమ్‌ టు సేమ్‌ రోల్‌ను పోషించాడు. రియల్‌ లైఫ్‌లో ప్రేమించిన అమ్మాయిని వదిలెయ్యడంతో పాటు, అటు తండ్రిని కూడా గాలికి వదిలేశాడు. పండుటాకులా మారిన తండ్రిని పొదివి పట్టుకోవాల్సిన చేతులతో, పైరసీలు చేస్తూ అటు సమాజానికి, ఇటు తండ్రికీ చెడబుట్టిన కొడుకుగా మారాడు.