హైదరాబాద్ కూకట్‌పల్లిలోని వివేకానందనగర్‌లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు అయింది. ఏపీ నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తరలిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కోటి రూపాయల విలువైన 840గ్రాముల కొకైన్, ఎపిడ్రిన్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.