విధి ఆడిన వింతనాటకంలో తల్లిదండ్రులను కోల్పోయారు ఆ బిడ్డలు అనాథలుగా మారారు. అందరితో ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసులో పిల్లలు దిక్కుతోచనిస్థితికి చేరారు. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగిన వారందరికీ బాలసదనం ఆశ్రయం అయ్యింది. అలాంటి వారికీ ఏదైనా తమ వంతు సాయం చేయాలని సదుద్దేశంతో ముందుకు వచ్చారు ఖమ్మం జిల్లా ఉన్నతాధికారులు. దసరా పండుగ సందర్భంగా వారితో కలిసి సంబరాలు జరుపుకున్నారు.