కొడుకు తిక్క కుదిర్చిన తండ్రి.. ఏం చేశారో తెలుసా?

తల్లిదండ్రులు తమ పిల్లలను అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. అయితే ఆ పిల్లలు మాత్రం తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారి బాగోగులు చూసుకునేందుకు ప్రస్తుత కాలంలో ఇష్టపడట్లేదు. ఆస్తిపాస్తులు, బంగారం, డబ్బులు తీసుకుని తల్లిదండ్రులను అనాథాశ్రమంలో వదిలేస్తున్నారు. వాళ్లను పట్టించుకోకుండా వేరే ఇంట్లో ఉంచుతున్నారు. వేరే దిక్కు లేక, చివరి రోజుల్లో అతికష్టం మీద బతుకు ఈడ్చుకుంటూ వాళ్ళు కూడా అలాగే వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. కానీ ఒక పెద్దాయన మాత్రం అందరిలా ఏడ్చుకుంటూ కూర్చోకుండా, తన కొడుకుపై పోరాటం చేశాడు. కన్న కొడుకు అన్నం పెట్టడం లేదని, తమ బాగోగులు చూసుకోవడంలేని కన్న కొడుకు పేరు మీద ఉన్న భూమిని తిరిగి మళ్ళీ ఇవ్వాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి విజయం సాధించాడు.