పోలీస్ స్టేషన్‌లో పొట్టి నిక్కర్‌తో జెడ్పీటీసీ భర్త చిందులు

పోలీస్ స్టేషన్‌లో పొట్టి నిక్కర్‌తో జెడ్పీటీసీ భర్త చిందులు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ జెడ్పీటీసీ భర్త నిర్వాకం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పొట్టి నిక్కర్‌తో పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మహిళా జెడ్పీటీసీ భర్త ఒరోరి అందగాడా.. నీకోసం.. నీ కోసం.. అనే పాటకు స్టెప్పులేసి పోలీస్ స్టేషన్ డాన్స్ క్లబ్‌గా మార్చేశాడు. అయన డాన్స్ చేస్తుంటే వీడియోలు తీసిన పోలీస్ సిబ్బంది మరింత ఎంకరేజ్ చేయడం కొసమెరుపు..!