ఈ వర్షం ధాటికి క్షేత్రంలో అలానే సుండిపెంటలో ప్రధాన వీధులన్ని జలమయమయ్యాయి. ఉదయం నుంచి ఉక్కపోతగా ఉన్న వాతావరణం మధ్యాహ్నం ఒక్కసారిగా మారిపోయింది. కారు మబ్బులు కమ్ముకున్నాయి. భారీ వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా శ్రీ మల్లన్న స్వామి అమ్మవార్ల దర్శనార్థం శ్రీశైలం క్షేత్రానికి వచ్చిన భక్తులు వసతి గృహాలకు పరిమితమయ్యారు.