శంషాబాద్ డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్‌లో ప్రయాణీకుల ఆందోళనకు దిగారు. హైదరాబాద్ - శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి ప్రయాగ్‌రాజ్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఉదయం ఎనిమిది గంటలకు వెళ్లాల్సిన విమానం ఇప్పటికీ రాకపోవడంతో ప్రయాణికులు ఆందోళన బాట పట్టారు.