రోజులు గడుస్తున్నాయి.. వారాలు మారుతున్నాయి. నెలలు పూర్తవుతున్నాయి. SLBC రెస్క్యూ ఆపరేషన్ మాత్రం కొలిక్కిరావడం లేదు. ఇంకా ఆరుగురి ఆచూకీ మాత్రం లభించలేదు. మరోవైపు సహాయక బృందాలు అలుపెరగకుండా శ్రమిస్తూనే ఉన్నాయి. ప్రమాద ఘటనలో రిసీవ్ ఆపరేషన్ వేగవంతమైంది. లోకోమోటివ్ సహాయంతో బండ రాళ్లను తొలగించే ప్రక్రియ వేగవంతం చేశారు.