ఒకటి ఒకటి.. రెండు రెండూ.. మూడు మూడు.. ర్యాంకులు అంటూ ఊదరగొట్టే ప్రైవేట్ పాఠశాలలకే నేటి విద్యా వ్యవస్థలో ఆదరణ ఉంటుంది. తల్లితండ్రులు కూడా అలాంటి ప్రైవేట్ పాఠశాలలకే మొగ్గు చూపుతున్నారు. ఆర్ధికంగా భారమైనప్పటికీ తమ పిల్లలను ప్రైవేట్‌లోనే చదివిస్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వంద శాతం ఫలితాలు సాధించి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా నాణ్యమైన విద్య అందుతుందని నిరూపించింది సూర్యాపేట జిల్లా తిరుమలగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల.