తెలంగాణ సీఎం రేవంత్‌తో సీపీఎం నేతల భేటీ..

తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాలపై సీపీఎం నేతలతో చర్చించామన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, వీరయ్యతోపాటు పలువురు కీలక నేతలు సీఎం నివాసంలో రేవంత్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా.. పార్లమెంట్‌ ఎన్నికల్లో మద్దతుపై చర్చించారు. భువనగిరి పార్లమెంట్‌తో పాటు ఇతర స్థానాల్లోనూ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని సీపీఎం నేతలను కోరినట్లు చెప్పారు సీఎం రేవంత్‌రెడ్డి. ఎన్నికల్లో మద్దతుకు బదులుగా సీపీఎం నేతల ముందు కొన్ని రాజకీయ ప్రతిపాదనలు పెట్టామన్నారు.